Page Loader
Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు కీలక ప్రకటన 
Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు కీలక ప్రకటన

Chandrababu: రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు కీలక ప్రకటన 

వ్రాసిన వారు Stalin
Feb 14, 2024
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చేశారు. ఉండవల్లిలో బుధవారం తన నివాసంలో పలువురు పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చించారు. అయితే ప్రస్తుతం జరిగే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని చంద్రబాబు పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా దూరంగా ఉండనుంది. 'రా కదలి రా', 'శంఖారావం' సభలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఎన్నికలకు 56 రోజులే ఉందని, అందుకే పార్టీ నేతలు ఎలక్షన్ మూడ్‌‌లోకి రావాలని అధినేత పిలుపునిచ్చారు. వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి రావడంపై ఆసక్తిని చూపిస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్నికల్లో పోటీకి దూరం