Page Loader
Chandra Babu: సీ ప్లేన్ ద్వారా విజయవాడ నుంచి శ్రీశైలంకు చంద్రబాబు.. పున్నమి ఘాట్‌లో ట్రయల్ రన్
సీ ప్లేన్ ద్వారా విజయవాడ నుంచి శ్రీశైలంకు చంద్రబాబు.. పున్నమి ఘాట్‌లో ట్రయల్ రన్

Chandra Babu: సీ ప్లేన్ ద్వారా విజయవాడ నుంచి శ్రీశైలంకు చంద్రబాబు.. పున్నమి ఘాట్‌లో ట్రయల్ రన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్ ట్రయల్ రన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి, పర్యాటక శాఖామంత్రి, ఇతర స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరు కానున్నారు. పున్నమి ఘాట్‌ నుంచి చంద్రబాబు సీ ప్లేన్‌లో ప్రయాణించి విజయవాడ నుంచి శ్రీశైలం చేరుకుంటారు. ఉదయం 10:30 గంటలకు పున్నమి ఘాట్ వద్దకు చేరుకోనున్న చంద్రబాబు, మధ్యాహ్నం 12 గంటలకు సీ ప్లేన్‌లో బయలుదేరి శ్రీశైలం పాతాళగంగ వద్ద బోటింగ్ పాయింట్‌కు మధ్యాహ్నం 12:40 గంటలకు చేరుకోనున్నారు.

Details

ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

అక్కడ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ దర్శనం చేస్తారు. అనంతరం శ్రీశైలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని, మీడియాతో మాట్లాడతారు. తర్వాత తిరిగి విజయవాడకు సీ ప్లేన్‌లో ప్రయాణిస్తారు. ఈ సందర్భంగా, శ్రీశైలం ప్రాజెక్టు ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డీ హవిల్లాండ్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను ప్రారంభించే ఈ కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీశైలం ఫారెస్ట్‌ పరిసరాల్లో గ్రేహౌండ్స్ బలగాలు, రిజర్వాయర్‌లో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీస్ బలగాలు హై స్పీడ్ ఇంజిన్ బోట్లతో రెస్క్యూ టీమ్స్‌ను మోహరించారు.