LOADING...
Talliki Vandanam:  సూపర్‌ సిక్స్‌లో మరో కీలక హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌
సూపర్‌ సిక్స్‌లో మరో కీలక హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌

Talliki Vandanam:  సూపర్‌ సిక్స్‌లో మరో కీలక హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా, 'తల్లికి వందనం' పథకానికి నిధులు విడుదల చేయాలని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 67.27 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.8,745 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం, ఒక్క తల్లికి ఎంతమంది పిల్లలుంటే, ఆ పిల్లలందరికీ 'తల్లికి వందనం' ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది 1వ తరగతిలో ప్రవేశించిన పిల్లలు, అలాగే ఇంటర్మీడియట్‌ కోర్సులో చేరిన విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తింపజేయనున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యాక, అవసరమైన డేటా అందుబాటులోకి రాగానే తల్లుల ఖాతాల్లో నిధులు వేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తల్లికి వందనం అమలు