
Anna Canteens: గ్రామీణ ప్రాంతాల్లోనూ న్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు.. 2025 మార్చి నెలాఖరులోగా ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మానసపుత్రిక అన్న క్యాంటీన్లకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.
గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లను వైసీపీ సర్కార్ మధ్యలో మూసేసినా, తర్వాతి కాలంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడిన తరువాత తిరిగి పునఃప్రారంభం చేసింది.
ప్రస్తుతం ఈ క్యాంటీన్లు పట్టణ,నగర ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
వీటి పరిధిని మరింత విస్తరించడానికి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, కలెక్టర్ల సదస్సులో ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.
వివరాలు
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా 199 అన్న క్యాంటీన్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు మొత్తం 199 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు.
ఇంకా మరికొన్ని క్యాంటీన్లు నిర్మాణంలో ఉన్నప్పటికీ, వీటిని త్వరలోనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోనున్నారు.
అయితే, ఈ అన్న క్యాంటీన్లు సరికొత్తగా ఉండడం వల్ల ప్రస్తుతం ఇవి ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం ప్రజల నుంచి డిమాండ్లు పెరిగాయి.
దీనిని దృష్టిలో పెట్టుకుని, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వీకరించి, గ్రామాలలో కూడా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధిక శాఖ కూడా దీనికి క్లియరెన్స్ ఇచ్చింది.
వివరాలు
తొలి విడతగా 63 క్యాంటీన్లను ప్రారంభించేలా చర్యలు
ఈ నేపథ్యంలో, నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో, సీఎం చంద్రబాబు గ్రామాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి అధికారులకు సూచనలు ఇచ్చారు.
స్థానిక ప్రజాప్రతినిధుల సలహాలను తీసుకొని, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాలను సూచించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో తొలి విడతగా 63 క్యాంటీన్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
ఈ ప్రక్రియలో మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేయబడతాయి.
మరింతగా క్యాంటీన్లకు ప్రజల నుంచి స్పందన రావడం దృష్ట్యా, భవిష్యత్తులో ఈ క్యాంటీన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.