Page Loader
Chandrababu: నీతి ఆయోగ్ అధికారులతో చంద్రబాబు సమావేశం.. విజన్‌ డాక్యుమెంట్‌పై చర్చ
నీతి ఆయోగ్ అధికారులతో చంద్రబాబు సమావేశం.. విజన్‌ డాక్యుమెంట్‌పై చర్చ

Chandrababu: నీతి ఆయోగ్ అధికారులతో చంద్రబాబు సమావేశం.. విజన్‌ డాక్యుమెంట్‌పై చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2024
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతిఆయోగ్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వికసిత్‌ ఏపీ - 2047 రూపకల్పనపై చర్చ జరిగింది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఏపీ విజన్‌ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. మాక్రో టు మైక్రో విధానాన్ని అనుసరించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా విజన్‌ డాక్యుమెంట్లు రూపొందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రాన్ని హై వాల్యూ అగ్రి ప్రాసెసింగ్‌ హబ్‌గా అభివృద్ధి చేయడమే కాకుండా,యువతకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

వివరాలు 

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి

అలాగే, దేశ తూర్పు తీర ప్రాంతానికి ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్‌, పరిశ్రమలు అభివృద్ధికి అనుకూలమైన చర్యలను చేపడుతున్నామని, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను గ్రోత్‌ సెంటర్లుగా మార్చే ప్రణాళికలతో పాటు, ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. పర్యావరణ అనుకూల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు, డిజిటల్‌ గవర్నెన్స్‌, ఆర్థికాభివృద్ధికి ఏపీని ఒక నమూనాగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.