
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌పై తీర్పును సీబీఐ కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
కస్టడీ పిటిషన్‌పై తీర్పును గురువారం ఉదయం 11:30గంటలకు వెలువరించనుంది.
చంద్రబాబును సీఐడీ 5రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని తాజా పిటిషన్‌లో పేర్కొంది.
ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో దాదాపు మూడు గంటల పాటు వాదనలు జరిగాయి. రూ.371 కోట్ల దుర్వినియోగంపై తమ వద్ద ఆధారాలున్నాయని సీఐడీ తరుఫు లాయర్ పొన్నవోలు కోర్టు వివరించారు.
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై కూడా హైకోర్టు గురువారం తీర్పును వెలువరించనుంది. సీబీఐ కోర్టు కూడా రేపే తీర్పు ఇవ్వనున్నట్లు నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చంద్రబాబు బెయిల్‌పై కూడా రేపే తీర్పు
చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ముగిసిన వాదనలు.
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2023
తీర్పును రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్. రేపు ఉదయం 11 గంటలకు తీర్పు. pic.twitter.com/IFfJHxI9gE