Page Loader
#Chandrababu - KCR: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు
Chandrababu - KCR: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు

#Chandrababu - KCR: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు

వ్రాసిన వారు Stalin
Dec 11, 2023
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో సోమవారం కేసీఆర్‌ను ఆస్పత్రిలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు, కేటీఆర్‌ను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఎర్రవల్లి నివాసంలోని గురువారం రాత్రి బాత్‌రూంలో కేసీఆర్ జారిపడగా.. ఎడమ తుంటికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఆదివారం కేసీఆర్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకొని, ఆసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యశోద ఆస్పత్రిలో చంద్రబాబు