Chandrababu Naidu :చంద్రబాబు భావోద్వేగం ..మళ్లీ జన్మ ఉంటే.. కుప్పంలో పుడతా
'నాకు మళ్లీ జన్మ ఉంటే.. కుప్పంలో పుడతా' అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు నియోజకవర్గంలో ఉండనున్నారు. సీఎంను చూడటానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. హంద్రీ-నీవా, కుప్పం బ్రాంచ్ కాలువలను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వంలో కుప్పంపై కక్షసాధించారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై మాజీ సీఎం జగన్ నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. చివరి దశకు చేరిన ప్రాజెక్టులను బీళ్లుగా మార్చారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.