Page Loader
చంద్రబాబు కి మరో షాక్..అక్టోబర్ 5 వరకు  రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు 

చంద్రబాబు కి మరో షాక్..అక్టోబర్ 5 వరకు  రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2023
07:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది. ఆ సమయంలో న్యాయస్థానం చంద్రబాబుకి 14 రోజులు రిమాండ్ విధించింది . ఆ తర్వాత 2 రోజుల పాటు పొడిగించింది. ఈరోజు తో రిమాండ్ ముగియడంతో ఆయనను వర్చువల్‌గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అక్టోబర్ 5వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అక్టోబర్ 5 వరకు చంద్రబాబు నాయుడుకు రిమాండ్ పొడిగింపు