తదుపరి వార్తా కథనం
    
     
                                                                                Nara Ramamurthy Naidu: నారా రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి విషమం.. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Nov 16, 2024 
                    
                     12:00 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే ఈ పర్యటన అనంతరం ఆయన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రామ్మూర్తి నాయుడు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Details
హైదరాబాద్ బయల్దేరిని మంత్రి లోకేశ్
అయితే దిల్లీ కాంక్లేవ్ పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆయన అక్కడి నుంచి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి తన సోదరుని పరిస్థిని పరిశీలించనున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ అమరావతిలోని అన్ని కార్యక్రమాలు రద్దు చేసి, వెంటనే హైదరాబాద్ బయల్దేరినట్లు సమాచారం అందింది.