Chandrababu: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట.. త్రిసభ్య ధర్మాసనానికి క్వాష్ పిటిషన్
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మానసం తీర్పును వెలువరించింది. ధర్మాసనంలోనికి ఇద్దరు న్యాయమూర్తులు భిన్న తీర్పులును ఇచ్చారు. దీంతో ఈ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన బెంచ్.. సీజేఐకి సిఫార్సు చేసింది. చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయడానికి నిరాకరిస్తూ సెప్టెంబర్ 22, 2023న ఏఫీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం గతేడాది అక్టోబర్ 17న తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు తీర్పును వెలువరించింది.