LOADING...
Chandrababu: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు కోరుతూ నేతలకు సీఎం చంద్రబాబు లేఖలు
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు కోరుతూ నేతలకు సీఎం చంద్రబాబు లేఖలు

Chandrababu: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు కోరుతూ నేతలకు సీఎం చంద్రబాబు లేఖలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖలు పంపించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే 'నారీ శక్తి వందన్‌' బిల్లుకు పార్లమెంట్‌లో సంపూర్ణ మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురందేశ్వరి, వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులకు ప్రత్యేకంగా లేఖలు పంపించారు.

వివరాలు 

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలక ఘట్టం

మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధానమంత్రి సంకల్పానికి అందరం బలమివ్వాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16న బిల్లును ప్రవేశపెట్టడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల సాధికారతకు, దేశ అభివృద్ధికి ఈ చట్టం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. పాలనలో, పరిపాలనా వ్యవస్థలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Advertisement