
చంద్రయాన్-3 ల్యాండింగ్: విద్యాసంస్థల్లో ప్రత్యక్ష ప్రసారానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
ఈ వార్తాకథనం ఏంటి
జాబిల్లికి అత్యంత దగ్గరగా వెళ్ళిన చంద్రయాన్-3, మంగళవారం సాయంత్రం 6:04గంటలకు చంద్రుడి మీద అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడి చేసింది.
రేపు సాయంత్రం 5:20గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉండనుందని కూడా ఇస్రో తెలియజేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్-3 సురక్షిత ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాలను స్కూలు, కాలేజీ విద్యార్థులు చూసే విధంగా పాఠశాలలు, కాలేజీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది.
.
Details
టీశాట్, నిపుణ ఛానెల్స్ లో ప్రత్యక్ష ప్రసారం
స్కూళ్ళు, కాలేజీల్లో ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి చంద్రుడి మీద చంద్రయాన్-3 సురక్షితంగా దిగడాన్ని చూపించనున్నారు. అలాగే టీశాట్, నిపుణ ఛానల్స్ లోనూ చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాలు వస్తాయని సమాచారం.
చంద్రుడి మీదకు చంద్రయాన్-3 ప్రయాణం జులై 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ శ్రీహరికోట నుండి మొదలైంది.
అప్పటి నుండి భూమి చుట్టూ తిరిగి, ఆ తర్వాత చంద్రుడి కక్ష్యలోకి చేరుకుని ప్రస్తుతం చంద్రుడికి అత్యంత దగ్గరలో ఉంది. అంతా సాఫీగా సాగితే రేపు సాయంత్రం 6:04గంటలకు చంద్రుడి దక్షిణ ధృవం మీద దిగనుంది.