తదుపరి వార్తా కథనం

PM Modi: ఆర్‌ఎస్‌ఎస్‌తో పేదల జీవితాల్లో మార్పు : ప్రధాని మోదీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 01, 2025
12:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటుంది. దిల్లీకి చెందిన బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంలో 100 రూపాయల నాణెం, పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. అనంతరం మోదీ ప్రసంగంలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా గుర్తించారు. అలాగే అసత్యపై సత్యం, అన్యాయంపై న్యాయం, అధర్మంపై ధర్మం గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.