Independence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు
స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సందేశమిచ్చారు. అందరూ తమ డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నరేంద్ర మోదీ ట్వీట్ చేసారు. దేశంతో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి చర్యలు దోహదపడుతాయని మోదీ ఆకాంక్షించారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమ స్ఫూర్తితో సోషల్ మీడియా ఖాతాల డీపీని అందరం మారుద్దామంటూ ప్రధాని మోదీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే తన ఫేస్‌బుక్, ట్విట్టర్ డీపీలుగా జాతీయ జెండాను పెట్టారు.
స్వాతంత్య్ర దినోత్సవానికి 1700 మంది ప్రత్యేక అతిథులు
ఈసారి స్వాతంత్య్ర దినోత్సవంలో 1700మంది ప్రత్యేక అతిథులు పాల్గొననున్నారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినేందుకు ఆహ్వానించబడిన 1,700 మంది ప్రత్యేక అతిథుల్లో జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, అమృత్ సరోవర్ యోజన, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ వంటి వివిధ కార్యక్రాలకు సంబంధించిన బాధ్యులు కూడా ఉన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం కోసం తయారు చేసిన గాలిపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆగస్టు 15న దిల్లీ అంతటా ఈ గాలి పటాలను ఎగురవేయున్నారు. ఆ గాలి పటాలపై ప్రధాని మోదీ బొమ్మతో పాటు డంబ్ ఇంజిన్ కి సర్కార్, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వంటి నినాదాలను ముద్రించారు.