మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీనగర్‌లోని లాల్ చౌక్ ఒకప్పుడు కర్ఫ్యూలు, ఉగ్రవాద దాడులకు నెలవుగా ఉండేది. నిత్యం ఇంటర్నెట్ ఆంక్షల్లో ఉండే ఆ ప్రాంతం త్వరలో ఉచిత వై-ఫై జోన్‌గా మారుబోతోంది. శ్రీనగర్‌ను స్మార్ట్‌సిటీగా చేయడంలో భాగంగా జమ్ముకశ్మీర్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్ (పీపీపీ)మోడ్‌లో ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు శ్రీనగర్‌లో మొదటిసారిగా ఎనిమిది ప్రదేశాలను ఫ్రీ వైఫై జోన్లుగా చేయాలని నిర్ణయించారు.
లాల్ చౌక్, జీలం నదిపై చెక్కతో నిర్మించిన జీరో బ్రిడ్జ్, చష్మే షాహీలోని మూడు ప్రసిద్ధ గార్డెన్‌లు, నిషాత్ గార్డెన్, షాలిమార్ బాగ్, జీలం రెండు వైపుల ఉండే ప్రదేశాలను వై-ఫై జోన్‌లుగా గుర్తించారు.
370ఆర్టికల్ రద్దు తర్వాత శ్రీనగర్‌లో వై-ఫై జోన్ల ఏర్పాటు అనేది విప్లవాత్మక చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు.
జమ్ముకశ్మీర్
హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని ప్రజలకు అందించాలన్నదే ఉద్దేశం
శ్రీనగర్‌లో వై ఫై జోన్ల ఏర్పాటు వెనుక ఉద్దేశం గురించి అక్కడి యంత్రాంగం ఒక పత్రాన్ని విడుదల చేసింది.
శ్రీనగర్‌లోని ప్రజలు, పర్యాటకుల కోసం, వాణిజ్య కార్యకలాపాలు జరిగే ప్రదేశాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడం వై-ఫై జోన్ల ఏర్పాటు ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొన్నారు.
ఎంపిక చేసిన ప్రాంతాల్లో వై-ఫై చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మొదటి 15 నిమిషాల పాటు వినియోగదారులందరికీ హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అందించబడుతుంది.
ఆయితే ఆ తర్వాత అదనపు డేటాను కొనుగోలు చేయడం ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్‌ని కొనసాగించే ఎంపిక ఉంటుంది.
ఈ -గవర్నమెంట్ సేవలను పౌరులకు వేగంగా, తక్కువ వ్యయంతో అందించాలన్న ఉద్దేశం కూడా దీని వెనుక ఉందని అధికారులు వెల్లడించారు.