LOADING...
Chaos in Bengal: బెంగాల్‌లో హింస.. ఆసన్సోల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. కుర్చీలు, వాహనాల ధ్వంసం
బెంగాల్‌లో హింస.. ఆసన్సోల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. కుర్చీలు, వాహనాల ధ్వంసం

Chaos in Bengal: బెంగాల్‌లో హింస.. ఆసన్సోల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. కుర్చీలు, వాహనాల ధ్వంసం

వ్రాసిన వారు Sirish Praharaju
May 04, 2026
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆసన్సోల్ ఇంజినీరింగ్ కాలేజ్ సమీపంలోని కౌంటింగ్ సెంటర్ వద్ద తోపులాట చోటుచేసుకుని కుర్చీలు,వాహనాలను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో సీఎం మమతా బెనర్జీ బీజేపీ,భారత ఎన్నికల సంఘం పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీఎంసీ ముందంజలో ఉన్నచోట్ల ట్రెండ్స్ విడుదల చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 148మెజారిటీ మార్క్ దాటేసి 197స్థానాల్లో ముందంజలో ఉంది. టీఎంసీ మాత్రం 91 సీట్లతో వెనుకబడింది. లెక్కింపు ఆపేశారంటూ కార్యకర్తలు సెంటర్ల వద్దే ఉండాలని మమతా పిలుపునిచ్చారు. భవానీపూర్‌లో మమతా తన ప్రత్యర్థి సువేందు అధికారి పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆసన్సోల్‌లో ఉద్రిక్త పరిస్థితులు

Advertisement