Page Loader
Chatrapati Shivaji: లండన్ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి..
లండన్ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి

Chatrapati Shivaji: లండన్ నుంచి భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి..

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 01, 2023
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఉపయోగించిన 'పులి పంజా' ఆయుధం తిరిగి భారతదేశం రానుంది. ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా ఛత్రపతి ఉపయోగించిన వాఘ్‌ నఖ్‌ ను(పులి గోళ్లను) నవంబర్ లో స్వదేశానికి తీసుకురానున్నారు. మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ 3 ఏళ్ల కాలానికి ఈ ఆయుధాన్ని భారత్ తెచ్చేందుకు ఒప్పంద పత్రాలపై మంగళవారం లండన్‌లో సంతకాలు చేయనున్నారు. బీజాపూర్ నవాబు అఫ్జల్‌ ఖాన్‌ను ఓడించిన రోజే వాఘ్‌ నఖ్‌ను తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ముంబైలోని శివాజీ మ్యూజియంలో ఈ మేరకు ప్రదర్శస్తామన్నారు. దేశవ్యాప్తంగా మరో 4ప్రాంతాల్లో ప్రదర్శించేందుకు మహారాష్ట్ర ప్రతిపాదించింది. లండన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్‌బర్ట్‌ మ్యూజియంలో వాఘ్‌నఖ్‌ను భద్రపరిచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబైలోని శివాజీ మ్యూజియంలో ఈ ఆయుధం ప్రదర్శన