RevOne :పన్ను ఎగవేతదారులకు చెక్.. 'రెవన్' పోర్టల్‌తో తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పన్ను ఎగవేతదారులపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేస్తూ, ఈ సమస్యను నియంత్రించేందుకు కొత్త పోర్టల్‌ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సీఎస్ నేతృత్వంలో రెవెన్యూ శాఖకు చెందిన విభాగాల కార్యదర్శులతో ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఆదాయం తెచ్చే అన్ని శాఖలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో 'రేవన్ (RevOne)' పోర్టల్‌ను రూపొందించనున్నారు. ఈ పోర్టల్ ద్వారా శాఖల మధ్య డేటా మార్పిడి సులభమవడంతో పాటు పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల వినోదపు పన్నుల వసూళ్లు, యూపీఐ, పీవోఎస్ లావాదేవీలపై నిఘా పెడుతోంది
వివరాలు
ద
కమిటీ 30 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 60 రోజుల్లో సమగ్ర నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉండగా, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 'భూభారతి' చట్టాన్ని అమలు చేస్తోంది. రైతులకు భూ భద్రత కల్పించడం, సేవలను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ క్రమంలో రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేలా 'భూభారతి పోర్టల్'ను ప్రారంభించింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రవ్యాప్తంగా ఐదు మండలాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యవస్థలో భాగంగా ఆధార్ కార్డు తరహాలో ప్రతి భూయజమానికి ప్రత్యేకంగా 'భూధార్' నంబర్ కేటాయించనున్నారు.
వివరాలు
తన
దీంతో భూమి వివరాల్లో పారదర్శకత పెరిగి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇకపై భూమి రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం పత్రాలు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయి కొలతలతో కూడిన మ్యాప్‌ను కూడా జత చేస్తారు. అమ్మకందారుడి నుంచి కొనుగోలుదారునికి భూమిని కొలిచి అప్పగించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోనుంది. పాతకాలపు గొలుసు పద్ధతులకు స్వస్తి పలుకుతూ, అత్యాధునిక రోవర్ యంత్రాలతో అంగుళం తేడా లేకుండా భూమి కొలతలు తీసే విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఇందుకోసం 5300 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ప్రతి మండలానికి 6 నుంచి 7 మందిని నియమించారు. ఈ చర్యలతో భూ వ్యవహారాల్లో పారదర్శకత పెరగడంతో పాటు, వివాదాలు తగ్గే అవకాశముందని ప్రభుత్వం ఆశిస్తోంది.