Page Loader
Cheddi Gang : తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. వణికిపోతున్న ప్రజలు
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. వణికిపోతున్న ప్రజలు

Cheddi Gang : తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. వణికిపోతున్న ప్రజలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2023
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడటంలో చెడ్డీ గ్యాంగ్ స్టైలే వేరు. చెడ్డీ వేసుకొని, ఇళ్లల్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతుంటారు. అవసరమైతే హత్యలకు కూడా వెనుకాడారు. తాజాగా తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో నగరంలో మూడు చోట్ల దొంగతనాలకు విఫలయత్నం చేసింది. ఇక సీసీ ఫుటేజీలో వారి కదలికలను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ మకాం వేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో జరిగిన మూడు చోరి ప్రయత్నాల్లో వీరి కదలికలు కనిపించాయని పోలీస్ నిఘా వర్గాలు తెలిపాయి.

Details

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి : పోలీసులు

ప్రస్తుతం సీసీ ఫుటేజీలో కనిపించిన దృశ్యాలను చూసిన ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, దిల్లీ రాష్ట్రాలకు చెందిన వారే ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతారు. చెడ్డీ గ్యాంగ్ ఊరి శివార్లలో తాత్కలిక నివాసం ఏర్పరచుకొని జీవిస్తారు. ఇక చెడ్డీ గ్యాంగ్ కదలికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాత్రివేళల్లో అపరిచితులకు తలుపులు తీయవద్దని పోలీసులు సూచించారు. రాత్రి పూట నిఘా మరింత ఎక్కువ పెట్టినట్లు ఎస్పీ పరమేశ్వరరెడ్డి పేర్కొన్నారు.