Chennai : చెన్నైలో కొనసాగుతున్న భీకర వర్షాలు.. తుఫానును ఎదుర్కోనేందుకు సీఎం అత్యవసర భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజధానిలో భీకర వర్షాలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఈ మేరకు తుఫానును ఎదుర్కోనేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మేరకు డిసెంబర్ 3న బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది.
దీంతో చెన్నై సహా తమిళనాడులోని మరో ఐదు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
ఇదే సమయంలో తుపాను సన్నద్ధతపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
బంగాళాఖాతంలో 'మియాచాంగ్' అనే తుఫాను వచ్చే అవకాశం ఉందని IMD వెల్లడించింది.రాష్ట్ర శాఖలు,జిల్లాల కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని,ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
details
ఆ జిల్లాల్లో మరో రెండు రోజులు ఎడతెరిపి వానలు
చెన్నై మహానగరంలో గురువారం మొదలైన ఎడతెరిపిలేని భారీ వర్షాలు, శుక్రవారం కూడా కురుస్తున్నాయి. మరోవైపు చెన్నైలో గురువారం నుంచి మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఆగ్నేయదిశగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవరించడంతో చెన్నై, పొరుగునున్న జిల్లాల్లో తుపాన్‌తో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.
భారీ వర్షాలు ఇక్కడే :
కోయంబేడు, మాంబళం తిరువల్లూరు, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్టు, విల్లుపురం, కుద్దలూరు, మైలాదుతురై, నాగపట్నం, తిరువరూరు, తంజావూరు, పుదుక్కొట్టై , రామనాథపురం, తూతుకూడి జిల్లా ల్లోను, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో గురువారం నుంచి మూడు రోజుల పాటు వరుసగా భారీ వర్షాలు కురవనున్నాయి.
వర్షాలు మరింత కురిసే అవకాశం ఉన్న కారణంగా రాష్ట్ర, జాతీయ విపత్తు బృందాలు అప్రమత్తమయ్యాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గురువారం చైన్నైలో వరుణ బీభత్సం
Almost the track and path of cyclone is confirmed. GFS model after touring Burma to odisha finally brought the track closer to Chennai / North Tamil Nadu
— Tamil Nadu Weatherman (@praddy06) December 1, 2023
What is special about this track. This track of WNW movement along our coast always has given very heavy rains. pic.twitter.com/TH6zkq1jrP
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తమిళనాడుకు దగ్గర్లోనే తుఫాను
Almost the track and path of cyclone is confirmed. GFS model after touring Burma to odisha finally brought the track closer to Chennai / North Tamil Nadu
— Tamil Nadu Weatherman (@praddy06) December 1, 2023
What is special about this track. This track of WNW movement along our coast always has given very heavy rains. pic.twitter.com/TH6zkq1jrP