LOADING...
Chennai: చెన్నై మెట్రో బ్లూ లైన్‌లో సాంకేతిక లోపం.. సొరంగ మార్గంలో నిలిచిపోయిన మెట్రో రైలు
సొరంగ మార్గంలో నిలిచిపోయిన మెట్రో రైలు

Chennai: చెన్నై మెట్రో బ్లూ లైన్‌లో సాంకేతిక లోపం.. సొరంగ మార్గంలో నిలిచిపోయిన మెట్రో రైలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నై మెట్రోలో ప్రయాణిస్తున్న వారికి మంగళవారం ఉదయం ఊహించని పరిస్థితి ఎదురైంది. బ్లూ లైన్‌లో నడుస్తున్న రైలు సాంకేతిక సమస్య కారణంగా సొరంగ మార్గంలో ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమ్కో నగర్ డిపో వైపు వెళ్తున్న ఈ రైలు, సెంట్రల్ మెట్రో - హైకోర్టు స్టేషన్ల మధ్య భూగర్భ మార్గంలో ఉండగానే నిలిచిపోయింది. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపోవడంతో లోపల ఉన్న వారు ఆందోళన చెందారు. పరిస్థితి తెలుసుకునేందుకు కిటికీల నుంచి బయటకు చూసారు. దాదాపు 10 నిమిషాల అనంతరం రైలు నుంచి దిగిపోయి సమీప హైకోర్టు స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లాలని సిబ్బంది తెలిపారు.

వివరాలు 

పట్టాలపై నడుచుకుంటూ స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులు 

దాదాపు 500 మీటర్ల దూరం వరకు ప్రయాణికులు వరుసగా పట్టాలపై నడుచుకుంటూ ముందుకు సాగి స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ విషయంపై స్పందించిన చెన్నై మెట్రో రైల్ యాజమాన్యం, సాంకేతిక లోపం లేదా విద్యుత్ అంతరాయం వల్లే సమస్య ఏర్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని తెలిపింది. అనంతరం సేవలు పూర్తిగా పునరుద్ధరించామని ఎక్స్ ద్వారా ప్రకటించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నామని కూడా పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చెన్నై మెట్రో బ్లూ లైన్‌లో సాంకేతిక లోపం

Advertisement