
Telangana: రేవంత్ రెడ్డితో మరో బిఆర్ఎస్ ఎమ్యెల్యే భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మరో బిఆబిఆర్ఎస్ర్ఎస్ ఎమ్యెల్యే భేటీ అయ్యారు.
ఈ రోజు(మంగళవారం) హైదరాబాద్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో చేవెళ్ల ఎమ్యెల్యే కాలే యాదయ్య మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల కోసం కలిసినట్టు తెలుస్తోంది.
తాజాగా యాదయ్య సీఎంను భేటీ కావడంతో.. ఆయన త్వరలో కారు దిగి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది.
అయితే,ఇటీవల కాలంలో బిఆర్ఎస్ ఎమ్యెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసం లో కలిశారు.
Embed
సీఎంని కలిసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య. pic.twitter.com/ORUAcMQhIG— Telugu Scribe (@TeluguScribe) March 5, 2024