LOADING...
Chevireddy Bhaskar Reddy: బెంగళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు
బెంగళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు

Chevireddy Bhaskar Reddy: బెంగళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎస్‌ఐటీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మిత్రుడు వెంకటేశ్ నాయుడును కూడా అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడుతో కలిసి శ్రీలంకకు వెళ్లేందుకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు.

Details

విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు

అయితే, వీరిద్దరిపై లుక్ అవుట్ సర్క్యూలర్‌లు ఉండటంతో ఇమిగ్రేషన్ అధికారులు వారిని అడ్డుకున్నారు. వెంటనే సంబంధిత సమాచారం సిట్ అధికారులకు తెలియజేశారు. ఆ సమాచారంతో బెంగళూరుకు చేరుకున్న సిట్ బృందం, ఇద్దరినీ అరెస్టు చేసి విజయవాడకు తరలించింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడును విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.