
ఛత్తీస్‌గఢ్: అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. బీజేపీ నేత కొడుకు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘోరం జరిగింది. కజిన్‌తో కలిసి రక్షా బంధన్ జరుపుకుని తిరిగి వస్తుండగా ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది.
ఊరుకెళ్లి తిరిగి వస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు, కజిన్‌ను పదిమంది దుండగులు అడ్డగించి, అత్యాచారానికి ఒడిగట్టారు. మొదట ముగ్గురు నిందితులు వారిని అడ్డగించారు.
ఆ తర్వాత వారి నుంచి నగదు, ఫోన్లు లాక్కున్నారు. కొద్దిసేపటికే మిగిలిన ఏడుగురు ద్విచక్రవాహనాలపై సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అనంతరం నిందితులు ఇద్దరు అక్కాచెల్లెళ్లను ప్రధాన రహదారికి దూరంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
అత్యాచారం
ప్రధాన నిందితుడు బీజేపీ నేత కుమారుడు
ఈ ఘటనలో ఇద్దరు బాలికలతో పాటు వారితో వచ్చిన వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక బీజేపీ నాయకుడి కుమారుడు సహా పది మందిని అరెస్టు చేశారు.
నిందితుల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఉన్నారు. ప్రధాన అనుమానితుల్లో ఒకరైన పూనమ్ ఠాకూర్ ఇటీవల ఆగస్టు 2023లో బెయిల్‌పై విడుదలయ్యారు.
పూనమ్ ఠాకూర్ స్థానిక బీజేపీ నాయకుడు లక్ష్మీ నారాయణ్ సింగ్ కుమారుడు కావడం గమనార్హం.