LOADING...
Chhattisgarh: కంప్యూటర్‌ను పక్కనబెట్టి కలంతో బడ్జెట్.. ప్రత్యేకతను చాటుకున్న ఛత్తీస్‌గఢ్ మంత్రి
కంప్యూటర్‌ను పక్కనబెట్టి కలంతో బడ్జెట్.. ప్రత్యేకతను చాటుకున్న ఛత్తీస్‌గఢ్ మంత్రి

Chhattisgarh: కంప్యూటర్‌ను పక్కనబెట్టి కలంతో బడ్జెట్.. ప్రత్యేకతను చాటుకున్న ఛత్తీస్‌గఢ్ మంత్రి

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

చాట్‌జీపీటీ యుగంలోనూ, ఛత్తీస్‌గఢ్‌ ఆర్థికమంత్రి ఒ.పి. చౌధరి తన ప్రత్యేకతను చాటుకున్నారు. బడ్జెట్‌ను కంప్యూటర్‌లో రూపొందించడం కంటే చేతిరాతతో తయారు చేస్తేనే తన భావాలను, ఉద్వేగాలను, దార్శనికతను, కట్టుబాటును స్పష్టంగా వ్యక్తీకరించగలనని భావించి, ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. హిందీలో వంద పేజీల బడ్జెట్ ప్రతిని, తన ప్రసంగాన్ని స్వయంగా రాయడానికి చివరి నాలుగు రోజులుగా రోజుకు గంట నుంచి గంటన్నర మాత్రమే నిద్రిస్తూ మిగతా సమయాన్ని పూర్తి మనోనిబద్ధతతో వినియోగించారని వెల్లడించారు. చేతిరాత ప్రతిగా బడ్జెట్‌ను రూపొందించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చని భావిస్తున్నారు.

Details

రూ.1.65 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్

రూ.1.65 లక్షల కోట్ల అంచనాలతో 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను మార్చి 4న శాసనసభలో ప్రవేశపెట్టారు. 2005 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన చౌధరి, 2018లో రాయ్‌పుర్‌ కలెక్టర్‌ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హిందీ భాషపై ఆయనకు అపారమైన మక్కువ ఉంది. 2018లో ఎన్నికల్లో ఓడిపోయినా, 2023లో ఎమ్మెల్యేగా గెలిచి, ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.