LOADING...
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. జవాన్ మృతి,ముగ్గరికి గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. జవాన్ మృతి,ముగ్గరికి గాయాలు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. జవాన్ మృతి,ముగ్గరికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చారు. ఈ దాడిలో ఒక జవాన్‌ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, భోపాల్‌పట్నం పరిధిలోని ఉల్లూరు అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జిల్లా రిజర్వ్‌ గార్డ్‌ (DRG) సిబ్బంది ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌లో మావోయిస్టుల కోసం శోధిస్తుండగా, మావోయిస్టులు ముందుగానే అమర్చిన ఐఈడీని పేల్చారు. ఈ పేలుడులో డీఆర్‌జీ జవాన్‌ దినేశ్‌ నాగ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మొదట చికిత్స చేసి, అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు స్పందిస్తూ, ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు