Page Loader
Kumari Aunty food stall: కుమారి ఆంటీకి అండగా నిలబడ్డ సీఎం.. త్వరలోనే ఫుడ్‌ స్టాల్‌ను సందర్శిస్తానని హామీ 
కుమారి ఆంటీకి అండగా నిలబడ్డ సీఎం.. త్వరలోనే ఫుడ్‌ స్టాల్‌ను సందర్శిస్తానని హామీ

Kumari Aunty food stall: కుమారి ఆంటీకి అండగా నిలబడ్డ సీఎం.. త్వరలోనే ఫుడ్‌ స్టాల్‌ను సందర్శిస్తానని హామీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2024
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కుమారి ఆంటీ స్ట్రీట్ పుడ్ ను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తొలగించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. స్ట్రీట్ పుడ్ అదే స్థలంలో కొనసాగుతుందని,ప్రజాపాలన అంటే ఇదేనని ఆయన తేల్చిచెప్పారు. అంతేకాదు, ముఖ్యమంత్రి త్వరలో కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ను సందర్శిస్తానని హామీయిచ్చారు. ఆంధ్రప్రదేశ్ చెందిన కుమారి ఆంటీ 2011 నుండి మాదాపూర్‌లోని ఐటీసీ కోహెనూర్‌కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో పుడ్ స్టాల్‌ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆమె బాగా వైరల్ అవ్వడంతో ఆమె స్ట్రీట్ ఫుడ్ కి జన ప్రవాహం పెరిగింది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి.. స్ట్రీట్‌ఫుడ్‌ స్టాల్‌ ను తొలగించాలని ఆదేశించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అయోధ్య రెడ్డి ట్వీట్