Page Loader
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ గెలవడానికి కారణం ఇదే: సీఎం శివరాజ్ చౌహాన్ 
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ గెలవడానికి కారణం ఇదే: సీఎం శివరాజ్ చౌహాన్

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ గెలవడానికి కారణం ఇదే: సీఎం శివరాజ్ చౌహాన్ 

వ్రాసిన వారు Stalin
Dec 03, 2023
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 230 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 64 సీట్లు రాగా, బీజేపీ 163 సీట్లు గెలుచుకుంది. అయితే రాష్ట్రంలో బీజేపీ మళ్లీ ఎందుకు గెలిచిందో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు. ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్‌తో పాటు సంక్షేమ పథకాలే మళ్లీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైనట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. అలాగే, తాము అమలు చేసిన పథకాలు ప్రజల అభ్యున్నతికి, వారి జీవితాలను మెరుగుపరిచేందుకు దోహదపడ్డాయని చౌహాన్ చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నించినా.. వారు తమనే నమ్మినట్లు వివరించారు. అలాగే తాను మరోసారి సీఎం అవుతానా? కాదా? అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న చౌహాన్