LOADING...
Telangana: తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నవంబరు 23న బాలల సాంస్కృతికోత్సవం
తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నవంబరు 23న బాలల సాంస్కృతికోత్సవం

Telangana: తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నవంబరు 23న బాలల సాంస్కృతికోత్సవం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2025
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సారస్వత పరిషత్తు ఈ సంవత్సరం నవంబర్ 23న హైదరాబాదులో ఒక ఘనమైన సాంస్కృతికోత్సవాన్ని నిర్వహించనుందని ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 6వ నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతికోత్సవంలో విద్యార్థులు అనేక రకాల పోటీల్లో పాల్గొనవచ్చు. ముఖ్యంగా రెండు ప్రధాన విభాగాల పోటీలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా విద్యార్థులు 'నైతిక విలువలు', 'సమయ సద్వినియోగం', 'విద్యార్థులు-ఉపాధ్యాయులు-సమాజం','నా కొత్త పుస్తకం' వంటి అంశాలపై తమ వ్యక్తిగత అనుభవాలను వ్యాసం రూపంలో రాయాలి. ఈ వ్యాసాలను ఈ నెల 31నుండి ముందుగా తెలంగాణ సారస్వత పరిషత్తు,తిలక్ రోడ్,బొగ్గులకుంట, అబిడ్స్,హైదరాబాద్-1 చిరునామాకు సమర్పించాలి.

వివరాలు 

పోటీల్లో విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు

ఉత్సవం రోజున అనేక సాంస్కృతిక పోటీలు జరుగుతాయి.వాటిలో ఏకపాత్రాభినయం, దేశభక్తి గీతాలాపన, లలిత గీతాలాపన, వ్యాసరచన, వక్తృత్వం, పుస్తక సమీక్ష వంటి విభిన్న పోటీలు ఉంటాయి. ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు కూడా ఇవ్వబడతాయి. పోటీల్లో పాల్గొనదలచిన విద్యార్థులు తమ పూర్తి వివరాలు.. పేరు, తరగతి, పాఠశాల, ఊరి పేరు వంటి వివరాలను 9603727234 నంబరుకు వాట్సాప్ ద్వారా పంపాలి. పోటీల్లో పాల్గొనకపోయినా ప్రతినిధులుగా రావాలనుకునే వారు ఈ నెల 31న పేర్లు నమోదు చేసుకోవాలి'' అని చెన్నయ్య సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక, సామాజిక, మరియు శాస్త్రీయ పరిపక్వత పెంపొందించడం లక్ష్యంగా ఉందని చెప్పారు.