Page Loader
కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్ 

కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్ 

వ్రాసిన వారు Stalin
May 20, 2023
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే వారం జీ20 సమావేశాన్ని కశ్మీర్‌లో నిర్వహించడంపై చైనా అక్కసును వెల్లగక్కింది. వివాదాస్పద ప్రాంతమైన కశ్మీర్ లో జీ20 సమావేశంను నిర్వహించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బీజింగ్‌లో జరిగిన సమావేశంలో ప్రకటించారు. మే 22 నుంచి మే 24 వరకు జమ్ముకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో మూడో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. 2019లో ప్రత్యేక హోదాను రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో నిర్వహిస్తున్న అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.

చైనా

చైనా వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం 

అయితే చైనా వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన సొంత భూభాగంలో సమావేశాలు నిర్వహించడంలో తప్పులేదని స్పష్టం చేసింది. చైనాతో సాధారణ సంబంధాలకు సరిహద్దులో శాంతి అవసరమని పేర్కొంది. శ్రీనగర్‌లో జరగనున్న జీ20 సమావేశం జమ్ముకశ్మీర్‌కు తన నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశం అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. శ్రీనగర్‌లో జరిగే ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమం దేశంలో, ప్రపంచవ్యాప్తంగా సానుకూల సందేశాన్ని పంపుతుందని ఆయన అన్నారు.