Page Loader
Nimmala Rama Naidu: 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం: నిమ్మల రామానాయుడు 
2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం: నిమ్మల రామానాయుడు

Nimmala Rama Naidu: 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం: నిమ్మల రామానాయుడు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 14, 2024
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2014-19మధ్య నిర్ణయించిన వ్యయంతో 40శాతం నిధులతో 39 శాతం పనులు జరిగాయని తెలిపారు. అయితే వైసీపీ పాలనలో కేవలం 7 శాతం నిధులతో 5 శాతం మాత్రమే పనులు సాగాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారని పేర్కొన్నారు. మరో సభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల సమాధానమిస్తూ తాడేపల్లిగూడె ప్రాంతంలోని ఎర్రకాలువకు పెద్ద నష్టం కలిగిందని,దీని ఆధునికీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అసెంబ్లీలో మాట్లాడుతున్న రామానాయుడు