LOADING...
Bengaluru: బెంగళూరు విమానాశ్రయంలో కత్తి దాడిని అడ్డుకున్న CISF అధికారి
బెంగళూరు విమానాశ్రయంలో కత్తి దాడిని అడ్డుకున్న CISF అధికారి

Bengaluru: బెంగళూరు విమానాశ్రయంలో కత్తి దాడిని అడ్డుకున్న CISF అధికారి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2025
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టర్మినల్-1 వద్ద ఆదివారం (నవంబర్ 16) అర్ధరాత్రి సమయంలో, VVIP పిక్‌అప్ పాయింట్ దగ్గర, ఒక వ్యక్తి ఇద్దరు టాక్సీ డ్రైవర్లపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. సుహైల్ అహ్మద్‌గా గుర్తించిన ఆ వ్యక్తి, డ్రైవర్లను వెంబడిస్తున్న సమయంలో అక్కడ విధుల్లో ఉన్న CISF ASI సునీల్ కుమార్ వెంటనే అడ్డుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేగంగా స్పందించడం వల్ల ఎవరికి గాయాలు కాలేదు. ఈ ఘటనపై CISF 'X' లో పోస్ట్ చేసింది. 'తమ సిబ్బంది వెంటనే జోక్యం చేసుకోవడంతో "పెద్ద ప్రమాదం తప్పింది" అని తెలిపింది.

వివరాలు 

ఘటనకు ముందే ఇద్దరి మధ్య పాత గొడవ

అలాగే, నిందితుడితో పాటు ఘటనకు సంబంధించిన వారందరిని వెంటనే KIA పోలీసులకు అప్పగించినట్టు వివరించింది. ఈ ఘటనకు ముందే ఇద్దరి మధ్య పాత గొడవ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం విషయమంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియోను CISF తరువాత ప్రజలకు విడుదల చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

CISF 'X' లో చేసిన పోస్ట్

వివరాలు 

 సుహైల్ ను డ్రైవర్లు ఇద్దరు కొట్టారని సమాచారం 

వీడియోలో 36 సంవత్సరాల సుహైల్ అహ్మద్‌ ఒక పొడవైన మెటల్ కత్తితో జగదీష్ JR,రేణుకుమార్ అనే ఇద్దరు డ్రైవర్లను వెంబడిస్తున్నట్లు కనిపిస్తుంది. వీరంతా ముందే ఒకరికొకరు పరిచయం ఉన్నట్లుగా సమాచారం. 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం ప్రకారం,ఈ ఇద్దరు,మరికొందరు తనను కొట్టారని సుహైల్ పోలీసులను తెలిపినట్టు సమాచారం. ఆ కోపంతోనే కత్తి తీసుకుని దాడి చేయాలని ప్రయత్నించినట్టు చెబుతున్నారు. "నవంబర్ 16 అర్ధరాత్రి సమయంలో, T1 అరైవల్ ప్రాంతంలో ఇద్దరు టాక్సీ డ్రైవర్లపై కత్తితో దాడికి యత్నించిన వ్యక్తిని ASI/Exe సునీల్ కుమార్ అండ్ టీమ్ వేగంగా అదుపులోకి తీసుకుని, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడకుండా తప్పించుకున్నారు," అని CISF తమ పోస్ట్‌లో పేర్కొంది.

వివరాలు 

KIA పోలీసులకు నిందితుడు

అదే పోస్ట్‌లో, "నిందితుడు, ఈ ఘటనకు సంబంధించిన వారందరినీ వెంటనే KIA పోలీసులకు అప్పగించాం. ప్రాథమిక విచారణ చూస్తే ఇది పాత గొడవకు ప్రతీకారం తీర్చుకునే చర్య అనిపిస్తోంది," అని తెలిపింది. "ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది, ముఖ్యమైన విమాన వసతుల భద్రతలో CISF ఎల్లప్పుడూ నిబద్ధతతో పనిచేస్తూనే ఉంటుంది," అని కూడా CISF పేర్కొంది.