పాకిస్థాన్ మహిళ 'హనీట్రాప్'లో విశాఖ స్టీల్ ప్లాంట్ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)కి చెందిన ఓ కానిస్టేబుల్ పాకిస్థాన్ మహిళ హనీట్రాప్ ఆపరేషన్‌కు బలయ్యాడు. కపిల్ కుమార్ అనే కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని సెక్యూరిటీ విభాగంలో పని చేస్తున్నారు. ఫేస్‌బుక్ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన తమిషా అనే మహిళతో కపిల్ కుమార్‌కు పరిచయమైనట్లు ఐఏఎన్ఎస్ పేర్కొంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. అప్పుడప్పుడు ఇద్దరు న్యూడ్ వీడియో కాల్స్ చేసుకునేవారని ఐఏఎన్ఎస్ విచారణలో తేలింది. కపిల్ కుమార్ వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన సీఐఎస్‌ఎఫ్ అధికారులు విచారణ చేపట్టారు. అతని మొబైల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. దీంతో పాకిస్థాన్‌కు చెందిన తమిషాతో కపిల్ చేసిన వ్యవహారమంతా బయటకు వచ్చింది.
అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు
కపిల్ కుమార్‌పై సీఐఎస్ఎఫ్ స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై విచారించేందుకు పలు జాతీయ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. పాకిస్థానీ మహిళకు కపిల్ కుమార్ ఏదైనా సున్నితమైన సమాచారాన్ని వెల్లడించాడా అనే విషయాన్ని గుర్తించేందుకు ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి. కపిల్ కుమార్ 2002 నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో సెక్యూరిటీ టీమ్‌లో భాగంగా పని చేస్తున్నాడు. అతను గతంలో హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో పనిచేశాడు.