CJP March: పార్లమెంట్ ముట్టడికి సీజేపీ పిలుపు.. జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, దేశ విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోమవారం 'చలో పార్లమెంట్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్ వైపు నిరసనకారులు భారీ ర్యాలీగా బయల్దేరారు. ర్యాలీ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా,ఆందోళనకారులు ముందుకు సాగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాలు
విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసిన ఢిల్లీ పోలీసులు
నిరసనకారులను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
ఈ ఆందోళన దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ముందస్తుగానే విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.
దేశ రాజధానిని హైఅలర్ట్‌లో ఉంచి కీలక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం జంతర్‌మంతర్ మినహా ఇతర ప్రాంతాల్లో ఐదుగురికి మించి గుమికూడకుండా ఆంక్షలు విధించారు.
ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు పోలీసులు సూచించారు.