Loading...
CJP: కేంద్రం హామీ నిలబెట్టుకోలేదు.. సీజేపీ తీవ్ర ఆరోపణలు
కేంద్రం హామీ నిలబెట్టుకోలేదు.. సీజేపీ తీవ్ర ఆరోపణలు

CJP: కేంద్రం హామీ నిలబెట్టుకోలేదు.. సీజేపీ తీవ్ర ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 27, 2026
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది. పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, ఇతర ఆందోళనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని కేంద్రం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీ మేరకే తాము నిరసనలను తాత్కాలికంగా విరమించుకున్నామని ఆయన తెలిపారు. అయితే ఇప్పటివరకు విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయలేదని పేర్కొన్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్ వంటి రాష్ట్రాల్లో పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు.

వివరాలు 

రేపటిలోగా..

ఈ అంశంపై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని సౌరవ్ దాస్ వెల్లడించారు.

కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మరోసారి కోరుతున్నామని చెప్పారు.

దేశవ్యాప్తంగా నిరసనకారులపై నమోదైన అన్ని కేసులను రేపటిలోగా ఉపసంహరించుకోవడంతో పాటు, ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.

ఈ విషయంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సీజేపీ విజ్ఞప్తి చేసింది.

వివరాలు 

నిరసనకారులపై ఏకే-47 తుపాకిని గురిపెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్

ఇదిలా ఉండగా, బిహార్‌లో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పోలీసులు ఏకే-47 తుపాకులతో వారిని లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

అలాగే, ఢిల్లీలో జరిగిన నిరసనల్లో విద్యార్థులపై పెల్లెట్ గన్‌లను ఉపయోగించారని కూడా ఆయన పేర్కొన్నారు.

విద్యార్థుల ఉద్యమాలను అణచివేసేందుకే కేంద్ర ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చిందని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు.

కాగా, జులై 25న నిర్వహించిన 'బిహార్ బంద్' సందర్భంగా సివాన్ జిల్లాలో జరిగిన ఆందోళనల సమయంలో ఓ పోలీసు కానిస్టేబుల్ నిరసనకారులపై ఏకే-47 తుపాకిని గురిపెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి.

ఈ ఘటన తీవ్ర వివాదానికి దారితీయడంతో సంబంధిత కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.

ADVERTISEMENT