తదుపరి వార్తా కథనం
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 01, 2025
04:28 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. గంగలూర్ అటవీ ప్రాంతంలో ఉదయం నుంచే భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య తీవ్రమైన కాల్పులు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుండగా, అడవుల్లో మరింతమంది మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.