Karnataka: చిన్నారిపై దారుణం.. 3 రోజులు బంధించి.. కొట్టారు
కర్ణాటకలోని రాయచూరు రామకృష్ణ ఆశ్రమంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది.పెన్ను దొంగిలించినందుకు ఆశ్రమంలోని గురూజీ ఓ బాలుడిని నిర్దాక్షిణ్యంగా కొట్టి మూడు రోజుల పాటు చీకటి గదిలో బంధించాడు. బాలుడిని తీవ్రంగా కొట్టడంతో కళ్లు వాచిపోయాయి.బాధితుడు తరుణ్ కుమార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి,పేదరికం కారణంగా ఆశ్రమంలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. తోటి విద్యార్థులతో ఆడుకుంటూ పెన్ను దొంగిలించడంతో సహ విద్యార్థులు ఆశ్రమ ఉపాధ్యాయుడికి సమాచారం అందించారు. ఫిర్యాదు అనంతరం రామకృష్ణ మఠానికి చెందిన గురూజీ వేణుగోపాల్ తరుణ్‌ను నిర్దాక్షిణ్యంగా కొట్టాడు. చిన్న పిల్లాడు అయినప్పటికీ మూడు రోజుల పాటు చీకటి గదిలో బంధించారు.తరుణ్ తల్లి యాదృచ్ఛికంగా రాయచూరు స్టేషన్ రోడ్డులో ఉన్న రామకృష్ణ ఆశ్రమానికి చేరుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు
ప్రస్తుతం తరుణ్ కుమార్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి చాలా గాయాలయ్యాయి. అతని కళ్ళు పూర్తిగా వాచిపోయాయి. ఈ సంఘటన రాయచూరు వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాలల కార్యకర్త, సుదర్శన్ మాట్లాడుతూ, "తరుణ్ అనే బాలుడిపై రామకృష్ణ ఆశ్రమ స్వామీజీ దాడి చేసినట్లు మేము మీడియా,హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా తెలుసుకున్నాము. నేను సంఘటన గురించి పోలీసు ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్‌కు కూడా తెలియజేశాను. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, చిన్నారికి రక్షణ కల్పిస్తామని చెప్పారు. పిల్లవాడిని స్కిశించిన గురుజీపై చర్యలు తీసుకుంటాము అని తెలిపారు.