Page Loader
Chandrababu: అమరావతిలో మరో రూ.2,723 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం
అమరావతిలో మరో రూ.2,723 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం

Chandrababu: అమరావతిలో మరో రూ.2,723 కోట్లతో నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2024
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ. 2,723 కోట్లతో కొత్త నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. జూన్ 12 నాటికి మొత్తం 1.18 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సీఆర్డీఏ 44వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఎల్పీఎస్‌ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ముఖ్యమైనదిగా ఉంది. అలాగే, రాజధాని ఔటర్ రింగ్ రోడ్,విజయవాడ బైపాస్ రోడ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఇప్పటి వరకు సీఆర్డీఏ ద్వారా రూ. 47,288 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.