AP SIPB: చంద్రబాబు నేతృత్వంలో 16వ SIPB మీటింగ్... గ్రీన్ సిగ్నల్ పొందిన ప్రాజెక్టులు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన 16వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ముఖ్య రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం రూ.39,436.84 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి.
వివరాలు
ప్రత్యక్షంగా 1,11,278 మందికి ఉద్యోగాలు
ప్రత్యేకంగా, ఈ పెట్టుబడుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్షంగా 1,11,278 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్ర అభివృద్ధికి దోహదం కానుంది. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పి. నారాయణ, కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వివరాలు
ఎస్‌ఐపీబీ ఆమోదం పొందిన పెట్టుబడుల వివరాలు:
విద్యుత్ రంగం (8 ప్రాజెక్టులు): మొత్తం పెట్టుబడి రూ.12,552 కోట్లు, ఉద్యోగాలు 69,070. 1. క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సిక్స్ ప్రైవేట్ లిమిటెడ్: కడప, అనంతపురం జిల్లాల్లో రూ.1,391 కోట్ల పెట్టుబడితో 190 ఉద్యోగాలు. 2. క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సిక్స్ ప్రైవేట్ లిమిటెడ్: కడప జిల్లాలో రూ.1,391 కోట్ల పెట్టుబడితో 190 ఉద్యోగాలు. 3. ఎస్సార్ రెన్యువబుల్స్ సోలార్ టు లిమిటెడ్: కర్నూలు జిల్లాలో రూ.1,327 కోట్ల పెట్టుబడితో 1,035 ఉద్యోగాలు. 4. ఎస్సార్ రెన్యువబుల్స్ హైబ్రిడ్ వన్ లిమిటెడ్: కర్నూలు జిల్లాలో రూ.2,714 కోట్ల పెట్టుబడితో 1,240 ఉద్యోగాలు. 5. ఎస్సార్ రెన్యువబుల్స్ హైబ్రిడ్ వన్ లిమిటెడ్: అనంతపురం జిల్లాలో రూ.1,714 కోట్ల పెట్టుబడితో 220 ఉద్యోగాలు.
వివరాలు
విద్యుత్ రంగం (8 ప్రాజెక్టులు): మొత్తం పెట్టుబడి రూ.12,552 కోట్లు, ఉద్యోగాలు 69,070.
6. పేస్ డిజిటెక్ ప్రైవేట్ లిమిటెడ్: కడప జిల్లాలో రూ.745 కోట్ల పెట్టుబడితో 345 ఉద్యోగాలు. 7. ఎస్‌ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో రూ.3,200 కోట్ల పెట్టుబడితో 65,000 ఉద్యోగాలు. 8. హెచ్‌హెచ్‌పీ ఎయిట్ ప్రైవేట్ లిమిటెడ్: తిరుపతి జిల్లాలో రూ.70 కోట్ల పెట్టుబడితో 850 ఉద్యోగాలు.
వివరాలు
ఐటీ, ఎలక్ట్రానిక్స్ (11 ప్రాజెక్టులు): మొత్తం పెట్టుబడి రూ.18,210.36 కోట్లు, ఉద్యోగాలు 36,411.
9. ఇన్ఫోసిస్ లిమిటెడ్: విశాఖ యండాడలో రూ.750 కోట్లతో 7,000 ఉద్యోగాలు. 10. క్రెడెన్స్ రియాలిటీ: విశాఖ తాళ్లవలసలో రూ.386.88 కోట్లతో 6,500 ఉద్యోగాలు. 11. ఫ్యూజీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్: విశాఖ కాపులుప్పాడలో రూ.425 కోట్లతో 2,500 ఉద్యోగాలు. 12. శ్రీటెక్ డేటా లిమిటెడ్: విశాఖ కాపులుప్పాడలో రూ.1,800 కోట్ల పెట్టుబడి. 13. పీజీ టెక్నోప్లాస్ట్: తిరుపతి జిల్లా శ్రీసిటీలో రూ.1,305 కోట్లతో 2,910 ఉద్యోగాలు. 14. ఎన్‌పీఎస్‌పీఎల్ స్పెషాలిటీ కెమికల్స్: చిత్తూరు జిల్లా కుప్పంలో రూ.2,550 కోట్లతో 400 ఉద్యోగాలు. 15. ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్: విశాఖపట్నంలో రూ.626.90 కోట్లతో 12,500 ఉద్యోగాలు.
వివరాలు
ఐటీ, ఎలక్ట్రానిక్స్ (11 ప్రాజెక్టులు): మొత్తం పెట్టుబడి రూ.18,210.36 కోట్లు, ఉద్యోగాలు 36,411.
16. ఆర్ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్: శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.10,239.78 కోట్లతో 3,017 ఉద్యోగాలు. 17. సీ డాక్: అమరావతి క్వాంటం వ్యాలీలో రూ.17 కోట్లతో 12 ఉద్యోగాలు. 18. పీక్యూ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్: అమరావతి క్వాంటం వ్యాలీలో రూ.1.8 కోట్లతో 20 ఉద్యోగాలు. 19. క్వాంటం ఏఐ గ్లోబల్: అమరావతి క్వాంటం వ్యాలీలో రూ.108 కోట్లతో 1,552 ఉద్యోగాలు.
వివరాలు
పర్యాటక రంగం (2 ప్రాజెక్టులు): పెట్టుబడి రూ.200.15 కోట్లు, ఉద్యోగాలు 270.
20. సన్ రే గ్రీన్ స్పేస్: విజయనగరంలో రూ.117.66 కోట్లతో 150 ఉద్యోగాలు. 21. రవిప్రియ హాస్పిటాలిటీస్: ఒంగోలులో రూ.82.49 కోట్లతో 120 ఉద్యోగాలు. ఫుడ్ ప్రాసెసింగ్ (2 ప్రాజెక్టులు): పెట్టుబడి రూ.1,222.73 కోట్లు, ఉద్యోగాలు 550. 22. ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్: తిరుపతిలో రూ.233.73 కోట్లతో 100 ఉద్యోగాలు. 23. రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్: చిత్తూరులో రూ.989 కోట్లతో 450 ఉద్యోగాలు.
వివరాలు
పరిశ్రమలు, వాణిజ్యం (8 ప్రాజెక్టులు): పెట్టుబడి రూ.7,251.6 కోట్లు, ఉద్యోగాలు 4,977.
24. మెట్రో డెకరేటివ్ లిమిటెడ్: నాయుడుపేటలో రూ.1,032 కోట్లతో 400 ఉద్యోగాలు. 25. ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా: విశాఖలో రూ.1,400 కోట్లతో 250 ఉద్యోగాలు. 26. శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ: నెల్లూరులో రూ.3,678 కోట్లతో 3,200 ఉద్యోగాలు. 27. బాల్ బెవరేజెస్ ప్యాకేజింగ్: శ్రీసిటీలో రూ.633 కోట్లతో 117 ఉద్యోగాలు. 28. సాన్సో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్: ఏలూరులో రూ.80 కోట్లతో 210 ఉద్యోగాలు. 29. ఆర్ఎస్‌బీ ట్రాన్సిమిషన్ లిమిటెడ్: శ్రీసిటీలో రూ.143.99 కోట్లతో 350 ఉద్యోగాలు. 30. వెంకటేశ్వర పేపర్ ప్రోడక్ట్స్: కృష్ణా జిల్లాలో రూ.63.61 కోట్లతో 100 ఉద్యోగాలు. 31. అనాడ్రోన్ సిస్టమ్స్: నెల్లూరులో రూ.221 కోట్లతో 350 ఉద్యోగాలు.