Chandrababu: అమరావతి ఈ-3 సీడ్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రవాణా వ్యవస్థకు ప్రాణాధారంగా నిలవనున్న ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ మహత్తర కార్యక్రమం రాజధాని ప్రాంతం కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో చేపట్టబడుతోంది. ఈ భారీ ప్రాజెక్టు కింద మొత్తం రూ.1,519 కోట్ల అంచనా వ్యయంతో 21.77 కిలోమీటర్ల పొడవు,60 మీటర్ల వెడల్పుతో కూడిన 9 లేన్ల అత్యాధునిక రహదారిని అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా, ఈ ప్రాజెక్ట్'లో భాగంగా విజయవాడ-మంగళగిరి హైవేను అనుసంధానం చేస్తూ, బకింగ్హామ్ కెనాల్పై 478 మీటర్ల పొడవునా 4 వరుసల కొత్త స్టీల్ బ్రిడ్జిని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు.
వివరాలు
అధికారులు,ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి
ఈ వంతెన రాజధాని ప్రాంతంలో ప్రయాణికుల రాకపోకలను మరింత సౌకర్యవంతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.
అంతేకాకుండా, సీడ్ యాక్సెస్ రోడ్డు పరిసర ప్రాంతంలో అధికారులు,ఉద్యోగుల వసతి కోసం ఏర్పాటు చేసిన 9 టవర్లలోని మొత్తం 216 క్వార్టర్ల నిర్మాణ పనులు పూర్తిగా ముగిశాయి.
వీటిలో అంతర్గత అలంకరణ (ఇంటీరియర్స్) పనులు కూడా పూర్తి చేశారు.
ఈ నివాస సముదాయాలకు సంబంధించిన తాళాలను అధికారులు సీఎం చంద్రబాబు నాయుడికి సమర్పించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభం
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం.
— ఉదయం (@udayamdigital) August 13, 2026
అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (@ncbn) గురువారం ప్రారంభించారు.
దీంతోపాటు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను కూడా ఆయన… pic.twitter.com/hRAjnM6K5X