Harbour fire: 'ఫిషింగ్ హార్బర్' ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. స్పందించిన పవన్
వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. కొందరు కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని సీఎం జగన్ సూచించారు. అలాగే, ఘటనా స్థలానికి వెంటనే వెళ్లాలని మంత్రి సీదిరిని సీఎం జగన్ ఆదేశించారు. ఇదిలా ఉంటే, అగ్ని ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఫిషింగ్ హార్బర్ లో అర్థరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన బోట్లు యజమానులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.