తదుపరి వార్తా కథనం

CM Jagan: శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు.. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు
వ్రాసిన వారు
Stalin
Feb 21, 2024
02:33 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం వైజాగ్‌లోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు.
వార్షికోత్సవాల్లో సందర్భంగా రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.
సంప్రదాయ వస్త్రాలు ధరించిన సీఎం.. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తర్వాత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ సీఎం జగన్‌తో పూజలు చేయించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ కూడా పాల్గొన్నారు.
అంతకుముందు ప్రత్యేక విమానంలో వైజాగ్‌కు విశాఖపట్నం చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రి బొత్స, ధర్మాన కష్ణదాస్, వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పూజలు చేస్తున్న సీఎం జగన్
విశాఖ శారదా పీఠం
— Janu (@JanuReddy123) February 21, 2024
రాజశ్యామల యాగంలో సీఎం వైఎస్ జగన్#Siddham#YSjaganAgain pic.twitter.com/mqQEKpXL1Y