Page Loader
KCR: ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
కేసీఆర్: ఉజ్జయిని మహంకాళి బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు

KCR: ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు

వ్రాసిన వారు Stalin
Jul 09, 2023
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన సతీమణితో కలిసి ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల వేడుక తెలంగాణ రాష్ట్ర పండుగ. ప్రతి సంవత్సరం ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా బోనాల పండగ నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆషాఢమాసంలో గ్రామదేవతలను ఆరాధించడంతో ప్రారంభమయ్యే బోనాలు పండుగ తెలంగాణలో కొన్ని దశబ్దాలుగా సంప్రదాయంగా వస్తుంది. అంతకుముందు కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం సమర్పించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహంకాళి అమ్మవారికి సీఎం కేసీఆర్ బోనం సమర్పణ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బోనం ఎత్తుకున్న కవిత