LOADING...
అమరవీరులకు సీఎం కేసీఆర్‌ శ్రద్ధాంజలి.. కోటలో కొనసాగుతున్న స్వాతంత్ర వేడుకలు
పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరులకు నివాళులు

అమరవీరులకు సీఎం కేసీఆర్‌ శ్రద్ధాంజలి.. కోటలో కొనసాగుతున్న స్వాతంత్ర వేడుకలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 15, 2023
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

77వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ సందర్భంగా సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం స్థూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. తొలుత పరేడ్ గ్రౌండ్ లో దిగిన సీఎం కేసీఆర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. మరోవైపు సంద‌ర్శ‌కుల రిజిస్ట‌ర్‌లో ఆయన సంత‌కం చేశారు. అంతకుముందు అధికార నివాసం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే కోట చుట్టూ భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గొల్కొండ కోటలో అట్టహాసంగా కొనసాగుతున్న వేడుకలు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రగతిభవన్‌లో స్వాతంత్ర వేడుకలు