CM Kcr : మహిళలు, బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ముఖ్యంగా చట్టసభల్లో బీసీలు, మహిళలకు రిజర్వేషన్ బిల్లులు ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మహిళలు, బీసీలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తీర్మాణం చేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు.
బీసీల పట్ల చిత్తుశుద్ధిని నిరూపించుకోవాలి
ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని ఆ లేఖ లో కోరారు. అయితే 2014లోనే తెలంగాణ అసెంబ్లీ బీసీ రిజర్వేషన్ కు తీర్మానం చేసినట్లు ఆ లేఖలో వివరించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి బీసీల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసింది.