LOADING...
Revanth Reddy: సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధిలో ఖర్చుకు వెనుకాడం.. స్థానికుల భాగస్వామ్యంతో 100 రోజుల్లో పనులు పూర్తి: రేవంత్‌ రెడ్డి
స్థానికుల భాగస్వామ్యంతో 100 రోజుల్లో పనులు పూర్తి: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధిలో ఖర్చుకు వెనుకాడం.. స్థానికుల భాగస్వామ్యంతో 100 రోజుల్లో పనులు పూర్తి: రేవంత్‌ రెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2025
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన సందర్శనలో,ఆయన ఆలయ అభివృద్ధి,ఆదివాసీల సంక్షేమంపై కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయాలను, స్థానిక అభిప్రాయాలను గమనించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి బాధ్యతతో కూడిన భావోద్వేగమని పేర్కొన్నారు. మంత్రి సీతక్కతో కలిసి ఈ ఆలయ అభివృద్ధిలో పాల్గొనడం తనకు గర్వకారణమని ఆయన తెలిపారు. కేంద్రం కుంభమేళాకు కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తుంటే, ఆదివాసుల 'మేడారం జాతర'కు ఎందుకు నిధులు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని, అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

వివరాలు 

పాదయాత్ర నుంచి ప్రగతికి: 

''సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదంతో 2023 ఫిబ్రవరి 6న ఇక్కడి నుంచి నా పాదయాత్ర మొదలైంది. తెలంగాణ ప్రజల కోసం చీడీపీడలను తగ్గించేందుకు ఈ గడ్డపై అడుగులు పెట్టాం. అప్పట్లో పాలకులు ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపించగా, మా ప్రభుత్వం ఎన్ని కోట్ల అవసరమైతే మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. ఆదివాసీ, పూజారి, సంప్రదాయ కుటుంబాలను భాగస్వాములుగా చేసుకొని పనిచేస్తున్నాం. సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదంతోనే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. స్థానికుల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. 100 రోజుల్లో పనులు పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలి.

వివరాలు 

మహా జాతర నాటికి ఈ పనులు పూర్తి అవ్వాలి

రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా డిజైన్లు రూపొందించాము. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణ విధానం పద్దతి చేసాం. జంపన్నవాగులో నీరు నిల్వ కోసం ప్రత్యేక ప్రణాళికలు ఉంటాయి. రాబోయే వంద రోజుల్లో నిష్టతో పనులు పూర్తిచేయాలి. మహా జాతర నాటికి ఈ పనులు పూర్తి అవ్వాలని లక్ష్యం. స్థానికుల సహకారం, భాగస్వామ్యం ఉంటే మాత్రమే సాధ్యమని తెలిపారు. ఈసారి జాతరను గొప్పగా జరుపుతాం'' అని తెలిపారు.

వివరాలు 

సమీక్షా సమావేశంలో ముఖ్య అంశాలు: 

మేడారం ఆలయ అభివృద్ధి పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను ఆయన శ్రద్ధగా విన్నారు. ''పోరాటం, పౌరుషానికి స్ఫూర్తినిచ్చేది సమ్మక్క-సారలమ్మలు. ఆ ఆశీర్వాదంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి వనదేవతలను సందర్శిస్తూ వచ్చాను. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. సంప్రదాయంలో వీసమెత్తులో కూడా ఏ విధమైన తేడా రాకూడదు. ఆదివాసీ పోరాట చరిత్ర, స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించేలా పనిచేయాలి'' అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.