Page Loader
CM Revanth Reddy: సిద్దిపేటలో కోకాకోలా పరిశ్రమను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేటలో కోకాకోలా పరిశ్రమను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సిద్దిపేటలో కోకాకోలా పరిశ్రమను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2024
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ గ్రామంలో కోకాకోలా సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రూ.1000 కోట్ల పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ తరహా పరిశ్రమలు రాష్ట్రానికి ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలను అందిస్తాయని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని రావడానికి ప్రభుత్వం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోందని చెప్పారు. ఈ పరిశ్రమను 500 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక యంత్రాలతో నిర్మించారు.

Details

2వేల మందికి ఉపాధి అవకాశాలు

ప్రారంభ దశలో 2000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతోపాటు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. కోకాకోలా సంస్థ తెలంగాణకు పెట్టుబడుల కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పర్యటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.