CM Vijay: జైల్ బ్రేక్ ఘటనపై సీఎం విజయ్ సీరియస్.. డిప్యూటీ జైలర్‌పై వేటు!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో జైలు భద్రతా వైఫల్యంపై ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీవ్రంగా స్పందించారు. థేని జిల్లాలోని ఠక్కంపట్టి సబ్‌జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారైన ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ ఎన్. రామలింగంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన అక్టోబర్ 26 రాత్రి చోటుచేసుకుంది. ఖైదీల్లో ఒకరు అనారోగ్యానికి గురైనట్లు నటించి జైలు సిబ్బందిని మోసం చేశారు. వైద్య అత్యవసర పరిస్థితి ఉందని నమ్మించి సెల్ తలుపులు తెరిపించుకున్నారు. అనంతరం సిబ్బందిపై దాడి చేసి, తాళాలు స్వాధీనం చేసుకుని ప్రధాన ద్వారం నుంచి 17 మంది పరారయ్యారు. అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వారందరినీ తిరిగి పట్టుకున్నారు.
వివరాలు
జైళ్ల శాఖలో కీలక అధికారుల బదిలీలు
ఖైదీల పరారీ ఘటనపై ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. జైళ్ల శాఖ డీజీపీ సందీప్ రాయ్ రాథోడ్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో కే. శంకర్‌ను నియమించింది.
అలాగే మదురై సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఆర్. కృష్ణరాజ్‌ను సేలం సెంట్రల్ జైలుకు బదిలీ చేసింది. జైళ్లలో భద్రత విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం విజయ్ ఆదేశించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు.