Chandrababu-Revanth Reddy: ఇవాళ దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్తున్నారు.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో మూడ్రోజుల పాటు మంత్రి, రాష్ట్ర బృందంతో విశేషంగా పర్యటించనున్నారు.
'బ్రాండ్ ఏపీ' ప్రమోషన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ సీఎం బృందం ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. చంద్రబాబు వెంట నారా లోకేష్, టీజీ భరత్, ఈడీబీ అధికారులు పాల్గొననున్నారు.
లక్ష్మీ మిత్తల్‌తో చంద్రబాబు ప్రత్యేక సమావేశంలో నిర్వహిస్తుండగా, రేవంత్ రెడ్డి దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొననున్నారు.
Details
చంద్రబాబు పర్యటన వివరాలివే
ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు హాజరయ్యే దావోస్ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనడం ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పర్యటనలో సీఎం వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఏపీలోని పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరపనున్నారు.
సోమవారం జ్యూరిచ్‌లో సీఎం చంద్రబాబు 10 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.
హోటల్ హయత్‌లో జరిగే 'మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా' కార్యక్రమంలో తెలుగు పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు.
సస్యశ్యామల ఇంధనం, గ్రీన్ ఎనర్జీపై చర్చించనున్నారు. సోలార్ ఇంపల్స్, వెల్‌స్పన్, కోకకోలా, ఎల్‌జీ, కార్ల్స్‌బర్గ్, వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్, సిస్కో, కాగ్నిజెంట్ సంస్థల ఛైర్మన్లు, సీఈఓలతో సమావేశం కానున్నారు.
Details
తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు రేవంత్ రెడ్డి కృషి
ఐటీ, ఫార్మా, బయోసైన్స్ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల అధినేతలు, బిజినెస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు.
ఈభేటీల ద్వారా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహాన్ని మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
దావోస్ పర్యటనలో ఐటీ, ఫార్మా,బయోసైన్స్, డేటా సెంటర్లలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
యువత నైపుణ్యాలను పెంచేందుకు ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీలు ముఖ్య పాత్ర పోషించనున్నాయి. గతేడాది దావోస్ పర్యటనలో తెలంగాణకు రూ. 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం ఈ పర్యటన ద్వారా పెట్టుబడులను పెంచడమే కాకుండా ఫార్మా, ఐటీ, డేటా సెంటర్లు వంటి కీలక రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తోంది.